Pakistan: పాకిస్థాన్ కు చావోరేవో మ్యాచ్... టాస్ గెలిచిన బంగ్లాదేశ్

Pakistan takes of Bangladesh in do or die match
  • వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్ × బంగ్లాదేశ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
  • కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ప్రచారం అందుకున్న పాకిస్థాన్ జట్టు, తీరా పోటీలు మొదలయ్యాక రేసులో వెనుకబడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్ వంటి జట్టు చేతిలో కూడా ఓడిపోయింది. ప్రస్తుతం పాక్ 6 మ్యాచ్ ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. పాక్ సెమీస్ చేరాలంటే ఇక మిగిలిన మూడు మ్యాచ్ ల్లో తప్పక నెగ్గాలి. అదే సమయంలో ఇతర మ్యాచ్ ల ఫలితాలు కూడా అనుకూలించాలి. 

ఈ నేపథ్యంలో, బాబర్ అజామ్ నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టు నేడు బంగ్లాదేశ్ తో తలపడుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం పాక్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్, ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్, స్పిన్నర్ నవాజ్ లను తప్పించారు. వారి స్థానంలో ఫఖార్ జమాన్, సల్మాన్ ఆఘా, ఉసామా మిర్ లకు తుది జట్టులో స్థానం కల్పించారు. 

మరోవైపు, బంగ్లాదేశ్ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి కేవలం 1 విజయం సాధించింది. 5 మ్యాచ్ ల్లో ఓడిన బంగ్లా జట్టు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలగింది.
Pakistan
Bangladesh
Eden Gardens
Kolkata
ICC World Cup

More Telugu News