Mahesh Babu: కన్న తల్లి కోర్కెను తీర్చబోతున్న మహేశ్ బాబు
![Mahesh Babu to fulfill his mothers last wish](https://imgd.ap7am.com/thumbnail/cr-20231030tn653f93fa451e1.jpg)
- సితారకు లంగా ఓణీ ఫంక్షన్ చేయాలనేది మహేశ్ బాబు తల్లి కోరిక
- కోరిక తీరకుండానే కన్నుమూసిన మహేశ్ తల్లి
- శుభకార్యాన్ని నిర్వహించాలని నిర్ణయించిన మహేశ్
టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబును కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. షూటింగులు లేని సమయంలో ఆయన తన కుటుంబంతోనే గడుపుతుంటారు. ఏడాదికి ఫ్యామిలీతో కలిసి రెండు, మూడు ఫారిన్ టూర్లు వేస్తుంటారు. మరోవైపు తల్లిదండ్రులు, అన్నను కోల్పోయిన బాధ నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మరోవైపు త్వరలోనే మహేశ్ బాబు ఇంట్లో ఒక శుభకార్యం జరగనుంది. తన తల్లి కోరిక మేరకు ఆ శుభకార్యాన్ని నిర్వహించాలని మహేశ్ బాబు నిర్ణయించారు.