Bithiri Sathi: పేదవారి గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్: బిత్తిరి సత్తి

Bithiri Sathi praises CM KCR

  • బిత్తిరి సత్తి వీడియోను షేర్ చేసిన బీఆర్ఎస్ పార్టీ
  • వేలకోట్లు ఉన్న నాయకులు పార్టీ మారుతున్నారని విమర్శలు
  • కానీ కేసీఆర్ మాత్రం డబ్బులు ఉన్న వారి గురించి ఆలోచించడం లేదన్న బిత్తిరి సత్తి

బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసలు కురిపించారు. పేదవారి గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన వీడియోను బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ఇటీవలే హరీశ్ రావును కలిసిన సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కొన్నిరోజుల ముందు ముదిరాజ్‌ల ఆత్మగౌరవ సభలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి, ఇప్పుడు కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో బిత్తిరి సత్తి మరో వీడియోను విడుదల చేశారు. నాయకులు ఎన్నికల సమయంలో పార్టీలు మారుతున్నారని, వారి వద్ద వేలకోట్ల రూపాయలు ఉండటంతో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్నారని, కానీ కేసీఆర్ మాత్రం వేలకోట్ల ఆదాయం ఉన్నవారి గురించి ఆలోచించడం లేదని, అయిదువేళ్లు నోట్లోకి వెళ్తున్నాయా? లేదా? అనే పేదవారి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని చెప్పారు. దీనిని అందరూ గమనించాలన్నారు.

Bithiri Sathi
KCR
Congress
BJP
Telangana Assembly Election
  • Loading...

More Telugu News