Vivek: కాంగ్రెస్ లో చేరనున్న వివేక్.. సాయంత్రం రాహుల్ తో సమావేశం

Vivek Venkataswamy to join Congress

  • బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరనున్న వివేక్
  • ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం
  • రేపు కాంగ్రెస్ చివరి జాబితా విడుదలయ్యే అవకాశం

మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ సాయంత్రం ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రాత్రి కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం. గత శనివారం రాత్రి పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో వివేక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పెండింగ్ జాబితాను విడుదల చేయనుంది.

  • Loading...

More Telugu News