Nagam Janardhan Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాగం

Nagam Janardhan Reddy resigns to Congress party
  • నాగర్ కర్నూలు టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి
  • కూచకుళ్ల రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి
  • త్వరలోనే బీఆర్ఎస్ లో చేరిక
తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు టికెట్ ను కూచకుళ్ల రాజేశ్ రెడ్డికి కేటాయించింది. ఈ పరిణామంతో నాగం మనస్తాపానికి గురైనట్టు సమాచారం. పార్టీ  నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన నిరసన గళం వినిపిస్తున్నారు. మద్దతుదారులతో చర్చించిన ఆయన కాంగ్రెస్ ను వీడుతున్నట్టు తాజాగా ప్రకటించారు. త్వరలోనే బీఆర్ఎస్ లో చేరనున్నట్టు వెల్లడించారు.
Nagam Janardhan Reddy
Congress
Resignation
BRS
Nagarkurnool
Telangana

More Telugu News