ndia batters: ముగ్గురు భారత స్టార్ బ్యాటర్ల బౌలింగ్ ప్రాక్టీస్

With Hardik sidelined India batters Kohli Gill Suryakumar start bowling in the nets

  • బాల్ తోనూ సాధన చేసిన కోహ్లీ, సూర్యకుమార్, గిల్
  • పాండ్యా లేని లోటును భర్తీ చేసే ప్రయత్నం
  • అవసరమైతే బౌలర్ గానూ ఫలితాలు రాబట్టే వ్యూహం

టీమిండియా లో కీలకమైన ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో, ప్రత్యామ్నాయ వనరులపై బీసీసీఐ దృష్టి సారించింది. పాండ్యా అయితే పేస్ బౌలింగ్ తో, బ్యాట్ తోనూ మెరుగైన పనితీరు చూపిస్తాడు. అతడు లేని లోటును తీర్చేందుకు ప్రత్యామ్నాయంగా స్టార్ బ్యాట్స్ మ్యాన్ లుగా పేరొందిన కోహ్లీ, శుభ్ మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అవసరమైతే బాల్ తోనూ రాణించాలన్నది వీరి సాధన వెనుకనున్న ఉద్దేశ్యం. 

గురువారం లక్నోలో టీమిండియా ఆటగాళ్లు సాధన చేశారు. మొదట కోహ్లీ బౌలింగ్ సాధన చేస్తూ కనిపించాడు. రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ కు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాతే కోహ్లీ ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్ మొదలు పెట్టాడు. నిన్న సాయంత్రం గిల్, సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ సాధన చేశారు. సిరాజ్ కు గిల్ బాల్స్ వేశాడు. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ కు సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశాడు. టీమిండియా ముఖ్యమైన బ్యాటర్లతో బౌలింగ్ చేయించడం ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా పాండ్యా గాయపడడం తెలిసిందే. టీమిండియా వచ్చే ఆదివారం లక్నోలోని ఏకనా స్టేడియంలో ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది.

  • Loading...

More Telugu News