Ganta Srinivasa Rao: దీన్ని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా: గంటా శ్రీనివాసరావు

Ganta Challenge to YSRCP

  • స్కిల్ సెంటర్లను ప్రభుత్వం డస్ట్ బిన్లుగా మార్చిందని గంటా మండిపాటు
  • చంద్రబాబుపై రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారని విమర్శ
  • స్కిల్ సెంటర్లలో అక్రమాలు జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్

స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లలో అక్రమాలు జరిగినట్టు నిరూపించగలిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. స్కిల్ సెంటర్లపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని చెప్పారు. మంత్రులు, సామంతులు, సలహాదారులు ఎవరు చర్చకు వచ్చినా రెడీ అని అన్నారు. స్కిల్ సెంటర్లను జగన్ ప్రభుత్వం డస్ట్ బిన్లుగా మార్చేసిందని విమర్శించారు. రాజకీయ కారణాలతో వాటిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. చంద్రబాబుపై రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారని అన్నారు. కోర్టు సెలవుల తర్వాత చంద్రబాబుకు అక్రమ కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పారు. ఆంధ్ర యూనివర్శిటీలోని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఈరోజు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గంటా పైవ్యాఖ్యలు చేశారు.

Ganta Srinivasa Rao
Chandrababu
Telugudesam
Sill Development Centers
YSRCP
  • Loading...

More Telugu News