Chandrababu: స్కిల్ కేసు: కాల్ డేటా అంశంలో కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు

CID files counter in call data records issue

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • సీఐడీ అధికారుల కాల్ డేటా కోరిన చంద్రబాబు న్యాయవాదులు
  • కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ అధికారులకు కోర్టు ఆదేశం
  • విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

స్కిల్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ లో పాలుపంచుకున్న సీఐడీ అధికారుల కాల్ డేటా అందించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ న్యాయస్థానం సీఐడీ అధికారులను ఆదేశించింది. అక్టోబరు 26వ తేదీని తుది గడువుగా పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు నేడు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారుల కాల్ డేటా అందిస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, కాల్ డేటా అందించడం భద్రత రీత్యా కూడా ఆందోళన కలిగించే అంశం అని సీఐడీ అధికారుల తరఫు న్యాయవాదులు కౌంటర్ లో పేర్కొన్నారు. కాగా, వాదనలు విన్న అనంతరం ఏసీబీ కోర్టు తదుపరి విచారణను రేపటి వాయిదా వేసింది.

Chandrababu
CID
Call Data
ACB Court
  • Loading...

More Telugu News