Sachin Tendulkar: దేవుళ్లతో పాటు తనకు అత్యంత ఇష్టమైన వాటికి పూజలు చేసిన సచిన్.. ఫొటోలు ఇవిగో
![Sachin Tendulkar performs pooja to Cricket bat and ball on Dasara](https://imgd.ap7am.com/thumbnail/cr-20231024tn65378a1e7b8e5.jpg)
- అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన సచిన్
- అందరికీ భగువంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన మాస్టర్ బ్లాస్టర్
- మంచి కారణం కోసం బ్యాటింగ్ ను కొనసాగించండని వ్యాఖ్య
సచిన్ ను, క్రికెట్ ను విడదీసి చూడలేము. టెండూల్కర్ ప్రపంచంలో క్రికెట్ తప్ప మరేమీ ఉండదు. దీనికి తగ్గట్టుగానే విజయ దశమి పండుగను సచిన్ తనదైన శైలిలో జరుపుకున్నాడు. పూజగదిలో దేవుళ్ల వద్ద క్రికెట్ బ్యాట్, బాల్ ను కూడా పెట్టి భక్తితో పూజ చేశాడు. పూజ తర్వాత తన తల్లి పాదాలకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. పూజకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఒక అద్భుతమైన మెసేజ్ ను కూడా పెట్టాడు. 'అందరికీ దసరా శుభాకాంక్షలు. బంతి బౌండరీ మీదుగా దూసుకెళ్లినట్టే... చెడుపై మంచి సాధించిన విజయం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. ఒక మంచి కారణం కోసం బ్యాటింగ్ ను కొనసాగించండి. అందరికీ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి' అని ట్వీట్ చేశాడు.
![](https://img.ap7am.com/froala-uploads/20231024fr653789ba15af7.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20231024fr653789c7a8eb2.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20231024fr653789d3c8b86.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20231024fr653789e257987.jpg)