Chennai airport: విమానాశ్రయంలో పెళ్లి సంబంధాల కియోస్క్.. నెట్టింట వైరల్
![Elite Matrimony store inside Chennai airport Passengers viral pic raises eyebrows](https://imgd.ap7am.com/thumbnail/cr-20231024tn653774c69559c.jpg)
- చెన్నై విమానాశ్రయంలో ఎలైట్ మ్యాట్రిమోనియ్ షాప్
- దీన్ని చూసి అవాక్కవుతున్న ప్రయాణికులు
- కనీసం మెడికల్ షాప్ కూడా లేకపోవడంపై విమర్శలు
విమానాశ్రయాల్లో ఎన్నో రకాల షాప్ లు కనిపిస్తుంటాయి. ఆదాయం పెంచుకునే మార్గాల్లో ఇదీ ఒకటి. అలాంటప్పుడు ప్రయాణికుల ప్రాథమిక అవసరాలకు సంబంధించి అన్నీ ఉండాలి కదా. అవసరమైన వాటిని పట్టించుకోకుండా, వేరే వాటికి ప్రాధాన్యం ఇస్తే ఏమనుకోవాలి? చెన్నై విమానాశ్రయంలో పెళ్లి సంబంధాలు వెతికి పెట్టే దుకాణం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని చూసి ప్రయాణికులు అవాక్కవుతున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. పెళ్లి సంబంధాలు వెతికి పెట్టే ‘ఎలైట్ మ్యాట్రిమోనీ’ దుకాణాన్ని చూసిన ఓ ప్యాసింజర్ దీన్ని ట్విట్టర్ లో ఏ పేరుతో ఉన్న హ్యాండిల్ పై పోస్ట్ పెట్టారు.