Australia: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం మృతి.. దాని వయసు ఎంతంటే..!

Worlds Oldest Dog Ever Bobi Dies

  • 31 ఏళ్ల 165 రోజుల వయసులో బోబీ కన్నుమూత
  • ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గిన్నిస్ రికార్డ్
  • జీవితమంతా ఒకే కుటుంబంతో గడిపిన శునకం

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ‘బోబీ’ చనిపోయింది. 31 సంవత్సరాల 165 రోజుల వయసులో అది మరణించింది. 11 మే 1992న జన్మించిన బోబీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక కాలం జీవించిన శునకంగా గుర్తింపు పొందింది.  

రఫీరో డో అలెంటెజో‌ బ్రీడ్‌కు చెందిన ఈ శునకం శనివారం పోర్చుగల్‌లో తాను నివాసముంటున్న ఇంట్లోనే చనిపోయింది. ‘‘ఈ స్వీట్ బాయ్ శనివారం రాత్రి నింగికి ఎగిశాడు’’ అంటూ బోబీని అనేకసార్లు పరీక్షించిన పశువైద్యుడు డాక్టర్ కరెన్ బెకర్ ఫేస్‌బుక్‌ వేదికగా ప్రకటించారు. కాగా బోబీ తన జీవితమంతా ఒకే కుటుంబంతో గడపడం విశేషం.

భూమిపై అన్ని శునకాల కంటే ఎక్కువ కాలమే జీవించినప్పటికీ.. బోబీని అమితంగా ఇష్టపడేవారికి 11,478 రోజులు సరిపోవు అంటూ డాక్టర్ కరెన్ ఎమోషనల్‌గా స్పందించారు. కాగా బోబీ కంటే ముందు 1939లో ఆస్ట్రేలియాకు చెందిన బ్లాయ్ అనే శునకం 29 సంవత్సరాల 5 నెలల వయసులో మరణించింది. అప్పటివరకు అదే అతిపెద్ద వయసున్న శునకంగా గుర్తింపు పొందింది. ఆ రికార్డును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బోబీ అధిగమించింది.

  • Loading...

More Telugu News