Medigadda Barrage: మేడిగడ్డ 20వ పిల్లర్ కుంగిన మాట వాస్తవమే: ఈఎన్ సీ వెంకటేశ్వర్లు

ENC Venkateswarlu clarifies Medigadda incident

  • కాళేశ్వరంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్
  • ఓ పిల్లర్ కుంగిపోయిన వైనం... బ్యారేజ్ పై నిలిచిన రాకపోకలు
  • రాజకీయంగా విమర్శలకు తావిచ్చిన ఘటన
  • పిల్లర్ కుంగడం వల్ల బ్యారేజ్ కు ప్రమాదం లేదన్న ఇంజినీర్ ఇన్ చీఫ్

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయిన సంగతి తెలిసిందే. రాకపోకలు సాగించే ఆ బ్యారేజిపై ఓ పిల్లర్ కుంగడం తీవ్ర ఆందోళన కలిగించింది. బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనడానికి ఇదే నిదర్శనమని విపక్షాలు అధికార బీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోశాయి. 

ఈ నేపథ్యంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు స్పందించారు. మేడిగడ్డ బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగిన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే బ్యారేజ్ కి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై నిపుణులతో పర్యవేక్షిస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు. కుంగిపోయిన పిల్లర్ ను 45 రోజుల్లో పునర్ నిర్మిస్తామని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి ఐదేళ్ల వరకు ఎల్ అండ్ టీ కంపెనీదే నిర్వహణ బాధ్యత అని వివరించారు.

Medigadda Barrage
Piller
ENC Venkateswarlu
Telangana
  • Loading...

More Telugu News