Adimulapu Suresh: దమ్ముంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడి చూపించు: పవన్ కల్యాణ్ కు ఏపీ మంత్రి సురేశ్ సవాల్

Minister Suresh comments on pawan kalyan studies
  • పవన్ కల్యాణ్ చదువుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న మంత్రి సురేశ్
  • చంద్రబాబు అరెస్టైతే నెల రోజులు దాటినా లోకేశ్ విడిపించుకోలేకపోయారని ఎద్దేవా
  • లోకేశ్, పవన్ కల్యాణ్‌లకు గ్యారెంటీ లేదన్న మంత్రి సురేశ్
జనసేనాని పవన్ కల్యాణ్ చదువుల గురించి మాట్లాడటంపై మంత్రి ఆదిమూలపు సురేశ్ చురకలు అంటించారు. పవన్ కల్యాణ్ చదువుపై విమర్శలు గుప్పించారు. ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ చదువు గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఆయనకు దమ్ముంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడి చూపించాలని ఎద్దేవా చేశారు. ఐరాస వేదికపై పేద విద్యార్థులు ఇంగ్లిష్‌ లో మాట్లాడుతున్నారన్నారు. కానీ జనసేనాని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, ఇంగ్లిష్‌ మీడియంపై పవన్ ఆరోపణలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు.

టీడీపీ, నారా లోకేశ్‌లకు రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదయితే 48 గంటల్లో విడిపిస్తానన్న లోకేశ్ కనీసం తన తండ్రిని నెలరోజులు దాటినా బయటకు తీసుకు రాలేకపోయారన్నారు. పాపం పండటం వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లాడన్నారు. తన యువగళం పాదయాత్రను లోకేశ్ ఎందుకు నిలిపేశాడో చెప్పాలన్నారు. లోకేశ్, పవన్ కల్యాణ్‌లకే గ్యారెంటీ లేదని, ఇక వారు ప్రజలకు చేసేదేముందన్నారు.
Adimulapu Suresh
Chandrababu
Pawan Kalyan
Nara Lokesh

More Telugu News