Hardik Pandya: రోహిత్.. పాండ్యా బదులు వీరిని తీసుకో: హర్భజన్
- గాయం కారణంగా న్యూజిలాండ్ తో మ్యాచ్ కు పాండ్యా దూరం
- ఆరో స్థానంలో సూర్యకుమార్ లేదా ఇషాన్ ను తీసుకోవాలన్న హర్భజన్
- శార్థూల్ ఠాకూర్ బదులు షమీతో ఆడించాలని సూచన
బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కాలి చీలమండకు గాయం అయింది. దీంతో అతడు ఈ ఆదివారం నాడు న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. కనీసం ఏడు రోజుల విశ్రాంతి అవసరమన్నది వైద్యుల సూచన. తదుపరి మ్యాచ్ కు పాండ్యా అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ కూడా ధ్రువీకరించింది. దీంతో హార్థిక్ పాండ్యా స్థానంలో కెప్టెన్, కోచ్ ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎవరిని తీసుకోవాలనే విషయమై టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ కీలక సూచనలు చేశాడు.