Roja: రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బుడబుక్కల సంఘం

Roja facing trouble

  • పవన్ కల్యాణ్ పై రోజా విమర్శలు
  • తమ సామాజికవర్గాన్ని కించపరిచారంటూ బుడబుక్కల నేతల ఆగ్రహం
  • పెనుగంచిప్రోలు పీఎస్ లో ఫిర్యాదు

ఏపీ మంత్రి రోజా ఒక వివాదంలో చిక్కుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బుడబుక్కల సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రోజా వ్యాఖ్యలు తమ కులస్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు మండిపడుతున్నారు. పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడిన రోజాపై కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట సంఘం నేతలు కాసేపు ఆందోళన చేశారు. తక్షణమే తమకు రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Roja
YSRCP
  • Loading...

More Telugu News