bsp: బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar releases BSP Election manifesto
  • ప్రతి మండలానికి ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్న బీఎస్పీ
  • ప్రతి ఏడాది మండలానికి 100 మందికి విదేశీ విద్యను అందిస్తామని హామీ
  • ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామన్న బీఎస్పీ
ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ అందిస్తామని బీఎస్పీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కాన్షీ యువ సర్కార్ పేరిట యువతకు అయిదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆ పది లక్షల ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.

ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఏడాది మండలానికి 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. ప్రతి సంవత్సరం రూ.25వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. భీమ్ రక్షా కేంద్రాల కింద వృద్ధులకు వసతి, ఆహారం, వైద్యం అందిస్తామన్నారు.
bsp
rs praveen kumar
Telangana Assembly Election

More Telugu News