Ponnala Lakshmaiah: చెప్పినట్లుగానే... పొన్నాల ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్

Minister KTR reaches to Ponnala Laxmaiah house

  • దానం నాగేందర్‌తో కలిసి పొన్నాల నివాసానికి వెళ్లిన కేటీఆర్
  • పార్టీలోకి ఆహ్వానించేందుకు వెళ్లినట్లుగా ప్రచారం
  • పొన్నాల నివాసం వద్ద ఆయన అనుచరుల నినాదాలు

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. పొన్నాల నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి కేటీఆర్ ఈ రోజు పొన్నాల నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ మాజీ నేతను పార్టీలోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ వెళ్లినట్లు తెలుస్తోంది. పొన్నాల నివాసానికి ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జనగామ గడ్డ... పొన్నాల అడ్డా అంటూ నినదించారు. 

కేటీఆర్ నిన్న మాట్లాడుతూ... పొన్నాల పార్టీలోకి వస్తామంటే ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేటీఆర్ చెప్నినట్టుగానే పొన్నాల ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Ponnala Lakshmaiah
  • Loading...

More Telugu News