Anand Mahindra: జీవితం అనంతమైన అవకాశాలతో నిండివుండి.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్

Anand Mahindra Shares Viral Video Once Again

  • సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్రా
  • పడవలోకి ఎక్కిస్తుండగా నీటిలో పడిన రోలర్
  • అంతకుముందే నీటిలో పడిన వ్యక్తి
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వ్యాపారవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. నిత్యం స్ఫూర్తిదాయక వీడియోలను అభిమానులతో పంచుకునే ఆయన తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ స్టీమ్ రోలర్‌ను పడవలోకి ఎక్కిస్తున్న వీడియో ఇది. ఒడ్డు నుంచి రెండు చెక్కల సాయంతో కొందరు వ్యక్తులు ఆ రోలర్‌ను పడవలోకి ఎక్కిస్తున్నారు. రోలర్‌పై ఉన్న వ్యక్తి దానిని ఆపరేట్ చేస్తున్నాడు. రోలర్ దాదాపు పడవలోకి ఎక్కేసిందని అనుకున్న వేళ పడవ ఒక్కసారిగా ఊగిపోయింది. ఈ క్రమంలో రోలర్‌ను పూర్తిగా ఎక్కించేందుకు చేసే ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ వ్యక్తి నీటిలోకి దూకేశాడు. ఆ వెంటనే రోలర్ కూడా నీటిలో పడిపోయింది. అయితే, ఇది ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు.

ఇది చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిలోకి దూకిన వ్యక్తిపైనే రోలర్ పడడంతో అతడి గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇది బహుశా ఇండియాలోనే జరిగి ఉంటుందని పేర్కొన్నారు. జీవితం అనంతమైన అవకాశాలతో నిండి ఉందని మనం విశ్వసిస్తామని.. తాను చెప్పే ఏకైక రక్షణ అదేనంటూ పరోక్షంగా ఇలాంటి సాహసాలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

More Telugu News