రేపటి నుంచి పాఠశాలలకు బతుకమ్మ, దసరా సెలవులు
- ఈ నెల 26న తిరిగి ప్రారంభం కానున్న ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్
- నేడు అన్ని స్కూల్స్‌లలో బొడ్డెమ్మ, బతుకమ్మ వేడుకలు
- బతుకమ్మలతో తరలి వచ్చిన విద్యార్థినులు
రేపటి నుంచి దసరా సెలవుల నేపథ్యంలో ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు తమ ఊళ్లకు బయలుదేరారు. దీంతో బస్సులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది.