KTR: కేటీఆర్ ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఎన్నికల ప్రధాన అధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు 

Congress complains to CEC against KTR
  • కాంగ్రెస్ నేతలు స్కాంలు చేసి బాగా సంపాదించారన్న కేటీఆర్
  • కాంగ్రెస్ నేతలు ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు తమకే వేయాలని కేటీఆర్ పిలుపు
  • కేటీఆర్ వ్యాఖ్యలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామి
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డబ్బు తీసుకుని ఓటేయాలంటూ కేటీఆర్ ప్రజలకు సూచిస్తున్నాడని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 

కాంగ్రెస్ నేతలు స్కాంలు చేసి బాగానే సంపాదించారని, ఆ డబ్బును ఎన్నికల్లో వెదజల్లుతారని, కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయాలని కేటీఆర్ ఇటీవల ఓ సభలో పిలుపునిచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని వేణుగోపాలస్వామి పేర్కొన్నారు. కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ ను కోరారు. కేటీఆర్ పై  ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే, తాము కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.
KTR
Congress
CEC
BRS
Telangana

More Telugu News