Chandrababu: అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న చంద్రబాబు న్యాయవాది.. కీలక సూచన చేసిన హైకోర్టు
- ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో హైకోర్టులో విచారణ
- సీఐడీ విచారణకు సహకరిస్తామన్న చంద్రబాబు తరపు లాయర్
- హోంశాఖ, సీఐడీతో మాట్లాడి చెప్పాలంటూ ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు సూచన
ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలను వినిపిస్తూ... చంద్రబాబును అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. కేసుల విచారణకు సహకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.... ఈ విషయంపై హోంశాఖ, సీఐడీతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి సూచించింది. భోజన విరామం తర్వాత తదుపరి విచారణను చేపడతామని చెప్పింది.