KCR: రూపాయలు ఇస్తే అమెరికా డాలర్లు అడిగి తీసుకోండి: మంత్రి కేటీఆర్

Minister KTR suggests people to ask money from opposition parties

  • అసెంబ్లీ ఎన్నికలకు లెక్క కుదిరిందన్న మంత్రి కేటీఆర్
  • నవంబర్ 30 ఎన్నికలు, డిసెంబర్ 3 ఫలితాలు రెండింట్లోనూ మూడు ఉందని, మూడోసారి కేసీఆర్ రావడం పక్కా అని ధీమా
  • రెండూ కలిస్తే ఆరు వస్తుంది.. ఇది తమకు అచ్చొచ్చిన నంబర్ అన్న కేటీఆర్

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లెక్క కుదిరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ అన్నారు. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉండనుందని, రెండు కలిపితే ఆరు వస్తుందన్నారు. ఇది తమకు అచ్చొచ్చిన నంబర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. తొర్రూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నవంబర్ 30లో మూడు ఉందని, డిసెంబర్ 3లో మూడు ఉందని కాబట్టి కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు.

తొమ్మిదేళ్ళ క్రితం తెలంగాణ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదో చూడాలన్నారు. మొసలి కన్నీరు కార్చినవారిని నమ్మవద్దన్నారు. సంక్రాంతి గంగిరెద్దుల వారు వచ్చినట్లు నాయకులు వస్తున్నారన్నారు. పాలకుర్తిలో అయితే రూపాయలకు బదులు డాలర్లకు డాలర్లు వస్తున్నాయట... అమెరికా నుంచి పెద్ద ఎత్తున డాలర్లు వస్తున్నాయని చెబుతున్నారన్నారు. ఇక్కడ ఎర్రబెల్లి దయాకరరావును ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు కసి మీద ఉన్నారని, అందుకే డాలర్లు వస్తున్నాయన్నారు.

మనం మోసాన్ని మోసంతోనే జయించాలన్నారు. ఎవరైనా రూపాయలు ఇస్తే డాలర్ కావాలని అడిగి మరీ తీసుకోవాలని, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్‌కు వేయాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇమానం, ప్రమాణం అంటారు, అవన్నీ చేసి ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయాలన్నారు. ఇప్పటి వరకు ఇచ్చింది కేసీఆరేనని, ఇక ముందు కూడా ఇచ్చేది కేసీఆరే అన్నారు. ఇది ఎమ్మెల్యే ఎన్నిక కాదని, ఇది మన రాష్ట్ర తలరాతను మార్చే ఎన్నిక అన్నారు.

  • Loading...

More Telugu News