V Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై తీర్పు వాయిదా

Telangana Minister Srinivas Goud Case Judgement Postphoned

  • 2018 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మహబూబ్ నగర్ వాసి
  • ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని వాదనలు

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై కొనసాగుతున్న వివాదంపై తీర్పును హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. తెలంగాణ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2018 ఎన్నికల సమయంలో ఆయన అఫిడవిట్ లో ఆస్తుల లెక్కలు తప్పుగా చూపించారని, ఒకసారి సమర్పించిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకుని పలు సవరణలు చేశారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దీనిపై మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని పిటిషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ ను మళ్లీ వెనక్కి తీసుకుని, సవరణలు చేయడం చట్ట విరుద్ధమని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో మంగళవారం తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.

  • Loading...

More Telugu News