Vijayasai Reddy: ‘కుల గురువు’ అన్నట్టు కాలమహిమ అంటే ఇదేనేమో: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on Nara Lokesh

  • తన తండ్రి జైలు నుంచి బయటకు రాడనే విషయం లోకేశ్ కు అర్థమయిందన్న విజయసాయి
  • తనకు కూడా అదే గతి తప్పదని భయపడుతున్నాడని ఎద్దేవా
  • నాన్న కోసం పాదయాత్రను మధ్యలోనే వదిలేశాడని ఎద్దేవా

టీడీపీ యువనేత నారా లోకేశ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో కామెంట్లు చేశారు. తన తండ్రి ఇప్పట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రాలేడనే విషయం లోకేశ్ కు అర్థమయిందని ఆయన అన్నారు. తనకు కూడా అదే గతి తప్పదేమోనని లోకేశ్ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. యువత కోసమని మొదలు పెట్టిన యాత్రను నాన్న కోసం మధ్యలోనే వదిలేశాడని అన్నారు. తానున్నానని క్యాడర్ కు ధైర్యం చెప్పాల్సింది పోయి ఢిల్లీలోని అత్యంత లగ్జరీ హోటల్లో బస చేస్తున్నాడని విమర్శించారు. ‘కుల గురువు’ అన్నట్టు కాలమహిమ అంటే ఇదేనేమో అని వ్యాఖ్యానించారు. 

Vijayasai Reddy
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News