Naga Chaitanya: సమంత, నాగ చైతన్య మళ్లీ కలుస్తున్నారా? కొత్త చర్చను లేవనెత్తిన నాగ చైతన్య పోస్ట్

Are Naga Chaitanya and Samantha patched up

  • 2021 అక్టోబర్ లో విడాకుల గురించి ప్రకటించిన సామ్, నాగ చైతన్య
  • వీరిద్దరూ కలవబోతున్నారంటూ ఇటీవల ప్రచారం
  • సమంత కుక్కను తన వద్ద ఉంచుకున్న నాగ చైతన్య

టాలీవుడ్ జంట సమంత, నాగ చైతన్య 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశారు. వారు విడిపోవడానికి కారణం ఏమిటనేది ఇంతవరకు ఎవరూ వెల్లడించలేదు. మరోవైపు వీరిద్దరూ మళ్లీ కలువబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాలో నాగ చైతన్య నిన్న చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది. 

వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు వారి వద్ద ఒక ఫ్రెంచ్ బుల్ డాగ్ ఉండేది. ఇలీవలే ఈ కుక్క నాగ చైతన్య ఇంట్లో ఉన్న వీడియో వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా నాగ చైతన్య ఆ కుక్క ఫొటోను షేర్ చేశాడు. తన కారులో పక్క సీట్లో కూర్చొని కుక్క ఉంది. సమంత వద్ద ఉండే ఈ కుక్కను ఇప్పుడు నాగ చైతన్య చూసుకుంటున్నాడు. ఈ ఫొటోను చూసిన నెటిజెన్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరూ కలిస్తే చాలా బాగుంటుందని మరికొందరు అంటున్నారు.

More Telugu News