Israel-Hamas war: ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలు!

US Says Citizens Killed In Hamas Attack Sends Warships To Support Israel

  • హమాస్ దాడుల్లో అమెరికా పౌరుల హతం
  • ఇజ్రాయెల్‌కు యుద్ధనౌకలు, విమానాలు పంపాలంటూ ఆదివారం బైడెన్ ఆదేశం
  • యూదుదేశానికి అండగా తామున్నామంటూ అంతకుముందే ప్రకటన
  • ఈ యుద్ధంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దంటూ అగ్రరాజ్యం వార్నింగ్

పాలస్థీనా ఉగ్రవాద సంస్థ హమాస్ దాడులతో ఇబ్బందుల్లో పడ్డ తన చిరకాల మిత్రదేశానికి అండగా అమెరికా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌కు సాయంగా ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తో పాటూ యుద్ధ విమానాలను పంపించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆదివారం ఆదేశించారు. దీంతో, ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్ యూఎస్ఎస్ జెరాల్డ్‌తో పాటూ దాని అనుబంధ యుద్ధ నౌకలు, ఇతర యుద్ధ విమానాలు ఇజ్రాయెల్‌కు బయలుదేరాయి. మరోవైపు, హమాస్ దాడుల్లో పలువురు అమెరికన్లు మరణించారని అమెరికా పేర్కొంది. అయితే, ఎంత మంది మరణించారు? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామంటూ అంతకుమునుపే అమెరికా విస్పష్ట ప్రకటన చేసింది. ఆ తరువాత కొద్ది సేపటికే తన ఆయుధ సంపత్తిని రంగంలోకి దించింది. అంతేకాకుండా, ఈ యుద్ధంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఇతర దేశాలకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది.

  • Loading...

More Telugu News