Gandhi Hospital: పేదలకు అందుబాటులోకి అత్యంత ఖరీదైన ఐవీఎఫ్ చికిత్స.. గాంధీ ఆసుపత్రిలో అందుబాటులోకి.. ఫొటోలు ఇవిగో!

- రూ. 5 కోట్లతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- నేడు ప్రారంభించనున్న మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్
- ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారంటూ కేసీఆర్‌కు హరీశ్ థ్యాంక్స్
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం రూ. 5 కోట్లతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దవాఖానలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నేడు మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారు. మంత్రి హరీశ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.


