Kanakamedala Ravindra Kumar: చంద్రబాబుతో ఎంపీ కనకమేడల ములాఖత్... జగన్‌పై విమర్శలు

Kanakamedala meets Chandrababu

  • జగన్ రూ.43వేల కోట్లు దోచుకున్నారన్న టీడీపీ ఎంపీ కనకమేడల
  • బెయిల్‌పై బయట ఉన్న వ్యక్తి చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారని చురకలు
  • చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం చూపించలేదని వ్యాఖ్య

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సీఎం జగన్ 43 వేలకోట్లు దోచుకున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. రాజమండ్రి కేంద్రకారాగారంలో ఈరోజు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జైల్లో  చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారన్నారు. ఈ రోజుకి కూడా జగన్ బెయిల్‌పై ఉండి కాలయాపన చేస్తున్నారన్నారు.

అలాంటి వ్యక్తి చంద్రబాబు నిజాయతీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక ఆధారాన్ని కూడా చూపలేకపోయారన్నారు. చంద్రబాబుకి ఏ రూపంలో ఎవరి ద్వారా నిధులు ముట్టాయో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆడిటర్స్ ద్వారా ప్రతి సంవత్సరం లెక్కలు బహిర్గతం చేస్తామన్నారు.

Kanakamedala Ravindra Kumar
Telugudesam
  • Loading...

More Telugu News