K Raghavendra Rao: ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉంది... చంద్రుడు రావాలి, వెలుగు తేవాలి: సినీ దర్శకుడు రాఘవేంద్రరావు

Raghavendra Rao supports NCBN

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • సినీ రంగం నుంచి మొదటగా స్పందించిన దర్శకేంద్రుడు
  • కాంతితో క్రాంతి కార్యాచరణకు పిలుపునిచ్చిన టీడీపీ
  • లైట్లు ఆపేసి దీపం వెలిగించిన రాఘవేంద్రరావు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కాగానే సినీ రంగం నుంచి మొదట స్పందించిన వ్యక్తి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. చంద్రబాబు అరెస్ట్ ను ఆయన బాహాటంగా ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందన్నారు. 

తాజాగా, టీడీపీ నాయకత్వం వచ్చిన పిలుపు మేరకు రాఘవేంద్రరావు 'కాంతితో క్రాంతి' కార్యాచరణలో పాల్గొన్నారు. ఇవాళ తన కార్యాలయంలో లైట్లు ఆపేసి దీపం వెలిగించారు. ఆ మేరకు ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉంది... చంద్రుడు రావాలి, వెలుగు తేవాలి అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రాఘవేంద్రరావు తాజా పోస్టుకు టీడీపీ మద్దతుదారుల నుంచి విశేష స్పందన వస్తోంది.

K Raghavendra Rao
Chandrababu
Arrest
Kanthi Tho Kranthi
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News