Aiden Markrum: వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ... రికార్డు బద్దలు కొట్టిన మార్ క్రమ్

Aiden Markrum sets new world record by making fastest century in World Cup history

  • వరల్డ్ కప్ లో ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక
  • 49 బంతుల్లో 100 పరుగులు చేసిన మార్ క్రమ్
  • కెవిన్ ఓ బ్రయాన్ రికార్డు తెరమరుగు

దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ ఐడెన్ మార్ క్రమ్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇవాళ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మార్ క్రమ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 49 బంతుల్లోనే ఈ రైట్ హ్యాండర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 

గతంలో ఈ రికార్డు ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓ బ్రయాన్ పేరిట ఉంది. కెవిన్ ఓ బ్రయాన్ 2011 వరల్డ్ కప్ లో బెంగళూరులో ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా 50 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఇదే రికార్డు. ఇవాళ మార్ క్రమ్ ఆ రికార్డు తిరగరాశాడు. 

కాగా, వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ మాత్రం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు.

  • Loading...

More Telugu News