KTR: ఇవాళ ఆయనను రేవంత్ రెడ్డి అనడంలేదు... 'రేటెంత రెడ్డి' అంటున్నారు: కేటీఆర్ వ్యంగ్యం

KTR slams TPCC Chief Revanth Reddy

  • రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేటీఆర్
  • ఆనాడు ఓటుకు నోటు... నేడు సీటుకో రేటు అంటూ విమర్శలు
  • కాంగ్రెస్ పార్టీలో పైసలు ఎక్కువ ఉన్నవాళ్లకే టికెట్లు ఇస్తున్నారన్న కేటీఆర్
  • ఎన్నికలు ముగిసిన మరునాడే రేవంత్ బీజేపీలో చేరతాడంటూ వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇవాళ ఏం జరుగుతోంది రాష్ట్రంలో... ఆనాడేమో ఓటుకు నోటు... నేడు సీటుకో రేటు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ మీరు చూస్తున్నారు... కాంగ్రెస్ పార్టీలో చాలా లొల్లి జరిగింది... పైసలు ఎక్కువ ఉన్నవాళ్లకే టికెట్లు ఇస్తున్నారు అని కేటీఆర్ ఆరోపించారు. 

టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు... జరుగుతున్న పరిణామాలతో మొన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నిన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి  తిరుపతిరెడ్డి రాజీనామా చేసి నా సమక్షంలోనే బీఆర్ఎస్ లో చేరారు అని వెల్లడించారు. 

ఇవాళ ఆయనను రేవంత్ రెడ్డి అనడంలేదు.. రేటెంత రెడ్డి అంటున్నారు... పాపం కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి వచ్చింది అంటూ కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. మరో విషయం కూడా రాసిపెట్టుకోండి... ఎన్నికలైన మరునాడే గెలిచిన పదో పన్నెండు మందో ఎమ్మెల్యేలతో కలిసి ఇదే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ చేయకపోతే నన్ను నిలదీయండి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

"ఈ రేవంత్ రెడ్డి ఒరిజినల్ గా కాంగ్రెస్ మనిషి కాదు, ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ మనిషి. 1999లో కిషన్ రెడ్డి కార్వాన్ లో పోటీ చేస్తే ఆయనకు ఎన్నికల ఏజెంటుగా రేవంత్ రెడ్డి వ్యవహరించాడు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేశాడు. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు బీజేపీతో తెరచాటు చీకటి అనుబంధం కొనసాగిస్తున్నాడు. ఆ గాడ్సేను గాంధీభవన్ లో కూర్చోబెట్టింది ఆ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లే. మైనారిటీలు ఆలోచించాలి.

ఢిల్లీ నుంచి ఒకాయన వస్తాడు... మీరు బీజేపీకి బి టీమ్ అంటాడు. ఇంకొకాయన వస్తాడు... మీరు కాంగ్రెస్ కి బి టీమ్ అంటాడు. ఎవరికో బి టీమ్ అవ్వాల్సిన అవసరం మాకేముంది? 

ఈ 23 ఏళ్లలో ఎలా తెలంగాణ ప్రజలను నమ్ముకుని ముందుకు వెళ్లామో, ఇకపైనా అలాగే ముందుకు వెళతాం... మేం ఎవరికీ బి టీమ్ కాదు. తెలంగాణ ప్రజల ఎ టీమ్ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీనే. ఎవరికో తొత్తుగా, ఎవరికో తోక పార్టీగా ఉండాల్సిన ఖర్మ మాకేం లేదు. కేంద్రంలో కూడా మా పాత్ర లేనిదే ప్రభుత్వాలు ఏర్పడని పరిస్థితి తీసుకువస్తాం" అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News