Uorfi Javed: ఇతరుల దుస్తులు విప్పి సంపాదించే వ్యక్తి ఇప్పుడు నా బట్టలపై కామెంట్ చేస్తున్నాడు: రాజ్ కుంద్రాకు రిటార్ట్ ఇచ్చిన ఉర్ఫీ జావేద్

Uorfi Javed blasts Raj Kundra for cracking joke on her

  • రాజ్ కుంద్రా ఇటీవలి వ్యాఖ్యలపై మండిపడ్డ నటి
  • మీడియాను ఎగతాళి చేస్తూ ఉర్ఫీ జావేద్ పై కామెంట్ చేసిన కుంద్రా
  • నేనేం ధరిస్తున్నా.. ఉర్ఫీ ఏం ధరించడంలేదనే విషయంపైనే మీడియా ఫోకస్ పెడుతోందని కుంద్రా విమర్శ

వినూత్న డ్రెస్ లు ధరించి నిత్యం మీడియాలో ఉండే బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ తాజాగా ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై మండిపడ్డారు. తన డ్రెస్ సెన్స్ పై కుంద్రా చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇతరుల దుస్తులు విప్పి డబ్బులు సంపాదించే వ్యక్తి కూడా తను వేసుకునే డ్రెస్ ల్ గురించి మాట్లాడుతున్నాడంటూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ రాజ్ కుంద్రాపై ఉర్ఫీ ఎందుకు మండిపడుతున్నారంటే..

పోర్న్ వీడియోలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా ఇటీవలి కాలంలో ఫేస్ మాస్క్ ధరించి కానీ బయటకు రావడంలేదు. బయట ఎక్కడ కనిపించినా ఆయన ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ఉంటోంది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా, భార్య కొడుకుతో కలిసి నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నపుడు కూడా రాజ్ కుంద్రా ముఖానికి మాస్క్ ఉంది. మీడియా ప్రతినిధులు ఈ మాస్క్ గురించి పదే పదే ప్రశ్నలు సంధించడంతో కుంద్రా అసహనంగా ఫీలవుతున్నారు.

దీనిపై సెటైరికల్ గా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. అందులో.. ‘ఈ రోజుల్లో మీడియాకు కేవలం రెండే రెండు విషయాలపై ఆసక్తి ఉంది. ఒకటి నేను ఏం ధరిస్తున్నాను.. రెండు, ఉర్ఫీ ఏం ధరించడంలేదు’ అంటూ మీడియాను ఎగతాళి చేశారు. రాజ్ కుంద్రా పెట్టిన పోస్టుపై ఉర్ఫీ తీవ్రంగా స్పందించింది. ఇతరుల బట్టలు విప్పడం ద్వారా డబ్బులు సంపాదించే వ్యక్తికి తన దుస్తులపై వ్యాఖ్యానించే అర్హత ఉందా.. అనే అర్థంలో ఇన్ స్టా పోస్ట్ పెట్టింది.

More Telugu News