space station: భారత్ కు అంతరిక్ష కేంద్రం ఎప్పటికి సిద్ధమవుతుంది?

When will India build own space station ISRO chief S Somanath responds

  • 20-25 ఏళ్లలో సాకారమవుతుందన్న ఇస్రో చీఫ్ సోమనాథ్
  • మానవ సహిత అంతరిక్ష నౌకపై తొలుత దృష్టి పెట్టినట్టు ప్రకటన
  • గగన్ యాన్ ప్రాజెక్టుపై పనిచేస్తున్న ఇస్రో

అంతరిక్ష పరిశోధన కేంద్రం (స్పేస్ స్టేషన్) ఏర్పాటు చేసుకోవాలని మన దేశం ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తోంది. కానీ ఎప్పుడు? ఇదే ప్రశ్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) చీఫ్ ఎస్.సోమనాథ్ కు ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. వచ్చే 20-25 ఏళ్లలో ఇది సాకారమవుతుందని చెప్పారు. ‘‘మన గగనయాన్ కార్యక్రమం అనేది మానవసహిత అంతరిక్ష నౌకను అంతరిక్షానికి పంపించేందుకు ఉద్దేశించినది. ఒక్కసారి ఇది సాకారం అయితే అప్పుడు అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించగలుగుతాం’’ అని సోమనాథ్ పేర్కొన్నారు. 

మానవ సహిత అంతరిక్ష అన్వేషణను తప్పకుండా చేపడతామని సోమనాథ్ స్పష్టం చేశారు. సుదూర శ్రేణి ప్రయాణించగల మానవ సహిత అంతరిక్ష నౌక, అంతరిక్ష శోధన తమ అజెండాలో భాగంగా ఉన్నట్టు చెప్పారు. నిజానికి గగనయాన్ ప్రణాళిక 2019లో మొదలైంది. వచ్చే పదేళ్లలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని ఇస్రో అనుకుంది. కానీ కరోనా రాకతో ఈ ప్రాజెక్టులో జాప్యం నెలకొంది. గగన్ యాన్ తర్వాత తదుపరి అడుగు అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడమేనని అప్పటి ఇస్రో చీఫ్  శివన్ ప్రకటించడం గమనార్హం.

  • Loading...

More Telugu News