KCR: చాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్

CM KCR suffering from chest infection says KTR

  • ఇటీవల వైరల్ జ్వరం బారినపడిన కేసీఆర్
  • చాతీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిందన్న కేటీఆర్
  • వేగంగా కోలుకుంటున్నారని, ఆందోళన అవసరం లేదన్న మంత్రి

ఇటీవల వైరల్ జ్వరం బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చాతీలో ఇన్ఫెక్షన్ అయింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఓ టీవీ చానల్‌తో మంత్రి మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాతీలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొదలైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని తెలిపారు.

KCR
KTR
Viral Fever
Chest Infection
  • Loading...

More Telugu News