Hai Nanna: నాని 'హాయ్ నాన్న' చిత్రం నుంచి 'గాజు బొమ్మ' లిరికల్ వీడియో విడుదల

Gaju Bomma lyrical song from Nani Hai Nanna movie out now

  • నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ప్రధాన పాత్రల్లో 'హాయ్ నాన్న'
  • దర్శకుడిగా పరిచయం అవుతున్న శౌర్యువ్
  • 'గాజు బొమ్మ' సాంగ్ లిరికల్ వీడియో పంచుకున్న చిత్రబృందం
  • హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం 
  • 'గాజు బొమ్మ' గీతాన్ని స్వయంగా ఆలపించిన హేషమ్ అబ్దుల్ వహాబ్

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'హాయ్ నాన్న'. వైరా ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి 'గాజు బొమ్మ' సాంగ్ లిరికల్ వీడియో రిలీజైంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చాడు. "ఇటు రావే నా గాజు బొమ్మా... నేనే నాన్నా అమ్మా... యద నీకు ఉయ్యాల కొమ్మా... నిన్ను ఊపే చెయ్యే ప్రేమా" అంటూ  సాగే ఈ గీతం తండ్రి, కుమార్తె మధ్య అనుబంధాన్ని చాటేలా ఉంది. హృదయాలను హత్తుకునేలా ఉన్న ఈ గీతాన్ని సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వయంగా ఆలపించాడు.

More Telugu News