Brahmaji: దర్శకుడు లోకేశ్ కనగరాజ్ మేనేజర్ నంటూ ఓ వ్యక్తి చీటింగ్... అప్రమత్తం చేసిన బ్రహ్మాజీ

Brahmaji alerts on cheating

  • తన పేరు నటరాజ్ అన్నాదురై అని చెప్పుకుంటున్న వ్యక్తి
  • లోకేశ్ కనగరాజ్ మేనేజర్ నంటూ ప్రచారం 
  • అతడు ఉపయోగిస్తున్న ఫోన్ నెంబరు కూడా పంచుకున్న బ్రహ్మాజీ

సినీ ప్రముఖుల పేర్లను ఉపయోగించుకుని మోసాలకు పాల్పడడం కొత్తేమీ కాదు. అయితే, ఓ వ్యక్తి ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరుతో కొత్త తరహా మోసానికి తెరలేపాడని నటుడు బ్రహ్మాజీ అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు చేశారు. 

అతడి తన పేరు నటరాజ్ అన్నాదురై అని చెప్పుకుంటున్నాడని, లోకేశ్ కనగరాజ్ కు మేనేజర్ నని ప్రచారం చేసుకుంటున్నాడని బ్రహ్మాజీ వెల్లడించారు. అతడు 78268 63455 నెంబరు నుంచి సినీ ఔత్సాహికులకు కాల్ చేస్తున్నాడని తెలిపారు. 

"లోకేశ్ కనగరాజ్ తదుపరి చిత్రానికి మీరు ఎంపికయ్యారు. కానీ కాస్ట్యూమ్స్ చాలా ప్రత్యేకమైనవి కావాల్సి ఉంటుంది. అందుకు మీరు డబ్బు ముందుగా చెల్లిస్తే కాస్ట్యూమ్స్ సిద్ధం చేస్తాం. ఆడిషన్ తర్వాత మీ డబ్బు మీకు తిరిగి చెల్లించడం జరుగుతుంది..." అంటూ ఆ వ్యక్తి నయా మోసానికి తెరలేపాడని బ్రహ్మాజీ వివరించారు. 

అంతేకాదు. సత్యదేవ్ అనే మరో వ్యక్తి 'ఫోర్బ్స్ ఇండియా' జర్నలిస్టునంటూ వర్ధమాన నటీనటులను మోసం చేస్తున్నాడని కూడా బ్రహ్మాజీ వెల్లడించారు. సత్యదేవ్ 90877 87999 ఫోన్ నెంబరు ఉపయోగిస్తూ ఇప్పుడిప్పుడే పైకొస్తున్న నటులను లక్ష్యంగా చేసుకుంటున్నాడని వివరించారు. కొందరు నటీనటుల నుంచి దీనికి సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని బ్రహ్మాజీ సూచించారు.

Brahmaji
Cheating
Lokesh Kanagaraj
Actors
Kollywood
Tollywood
  • Loading...

More Telugu News