Venkatesh Daggubati: 'సైంధవ్' రిలీజ్ డేట్ ఇదే .. అధికారిక ప్రకటన!

Saindhav Movie Release Date Confirmed
  • వెంకటేశ్ 75వ సినిమాగా 'సైంధవ్'
  • యాక్షన్ ... ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ 
  • సంగీతాన్ని అందిస్తున్న సంతోష్ నారాయణ్ 
  • జనవరి 13వ తేదీన సినిమా విడుదల
వెంకటేశ్ కథానాయకుడిగా 'సైంధవ్' సినిమా రూపొందుతోంది. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. టైటిల్ తో .. వెంకటేశ్ ఫస్టులుక్ తో ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచింది. అలాంటి ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ సెట్ చేసుకుంది. 

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టుగా చెప్పారు. 

కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా, ప్రతినాయకుడి పాత్రను నవాజుద్దీన్ సిద్ధికీ పోషించాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో శ్రద్ధ శ్రీనాథ్ .. రుహాని శర్మ .. ఆర్య కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Venkatesh Daggubati

More Telugu News