World Cup: ఇ–రిక్షాలో చక్కర్లు కొట్టిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు.. వీడియో ఇదిగో!

Australian players enjoying their time in Kerala

  • భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఓడిన ఆసీస్
  • నేడు నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనున్న కంగారూ టీమ్
  • అక్టోబర్ 3న ఉప్పల్‌లో పాకిస్థాన్‌తో మరో వార్మప్ మ్యాచ్‌

భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ను పూర్తి చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి సిద్ధమైంది. ఈ టోర్నీకి ముందు  రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు కేరళ వెళ్లింది. అక్కడి  తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టులోని కొంతమంది సభ్యులు బయట సేదతీరారు. కేరళ అందాలను ఆస్వాదించారు. 

స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, సీన్ అబాట్ ఇ‌‌–రిక్షాలో ప్రయాణిస్తూ.. సముద్ర అందాలను వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్మిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌‌ చేశాడు. అక్టోబర్ 3న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్ జట్టుతో వార్మప్ మ్యాచ్‌ ఆడనున్న ఆస్ట్రేలియా.. 8న చెన్నైలో భారత్‌తో వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో పోటీ పడనుంది.

More Telugu News