Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం, కుంభం అనిల్

Mynampalli Hanmantha Rao joins Congress
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేరిక
  • తనతో పాటు కొడుక్కి టిక్కెట్ కోసం బీఆర్ఎస్‌ను వీడిన మైనంపల్లి
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహా పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరినవారిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ తదితరులు చేరారు.

మల్లికార్జున ఖర్గే వారికి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తదితరులు ఉన్నారు. మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్ఎస్ మల్కాజిగిరి టిక్కెట్ ఇచ్చింది. అయితే తన తనయుడికి మెదక్ టిక్కెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
Congress
mynampalli hanmantharao
BRS
Revanth Reddy
Mallikarjun Kharge

More Telugu News