Chandrababu: ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టిన చంద్రబాబు స్నేహితులు... వీడియో ఇదిగో!

Chandrababu friends protests with placards in Chandragiri

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • జీర్ణించుకోలేకపోతున్న స్నేహితులు
  • మా స్నేహం మీద ఒట్టు... చంద్రబాబు తప్పు చేయరని నినాదాలు
  • చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రిలే నిరాహార దీక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడం పట్ల ఆయన స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి పాల్పడే వ్యక్తి కాదని, ఆయన ఎలాంటివాడో తమకు తెలుసని స్నేహితులు స్పష్టం చేశారు. 

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో చంద్రబాబు చిన్ననాటి స్నేహితులు పాల్గొన్నారు. మా స్నేహంపై ఒట్టు... చంద్రబాబు తప్పు చేయరు అంటూ నినదించారు. ప్లకార్డులతో తమ మిత్రుడికి సంఘీభావం ప్రకటించారు. 

నీచ రాజకీయాలకు చంద్రబాబు ఎప్పుడూ దూరమేనని, ఆయనకు కుట్రలు, కుతంత్రాలు తెలియవని వారు పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తేనే ఫలితం ఉంటుందని నమ్మే వ్యక్తి చంద్రబాబు అని, సీఎం జగన్ కక్ష సాధింపు వల్లే ఆయన జైలుపాలయ్యారని స్నేహితులు వ్యాఖ్యానించారు.

More Telugu News