Pakistan: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు

Pakistan cricket team arrives Hyderabad

  • భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్
  • లాహోర్ నుంచి దుబాయ్ మీదుగా భారత్ లో అడుగుపెట్టిన పాక్
  • శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి భారీ భద్రత నడుమ హోటల్ కు తరలింపు

ఐసీసీ వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్ లో కాలుమోపింది. 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్ బృందం కొద్దిసేపటి కిందట హైదరాబాద్ చేరుకుంది. ఈ మధ్యాహ్నం పాక్ జట్టు లాహోర్ నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్ మీదుగా భారత్ పయనమైంది. పాక్ జట్టు రాక నేపథ్యంలో హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పాక్ ఆటగాళ్లను ఎయిర్ పోర్టు నుంచి నేరుగా వారికి కేటాయించిన హోటల్ కు తరలించారు. ఈ నెల 29న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు కివీస్ తో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

Pakistan
Cricket Team
Hyderabad
World Cup
India

More Telugu News