YS Jagan: మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చింది!: పార్టీ నేతలతో వైఎస్ జగన్

YS Jagan meeting with party leaders

  • టిక్కెట్ విషయంలో తన నిర్ణయాన్ని గౌరవించాలని సూచన
  • టిక్కెట్ రాని వారికి మరో పదవి ఇస్తామని చెప్పిన అధినేత
  • 175 సీట్లకు 175 గెలవడం అసాధ్యమేమీ కాదన్న జగన్

ఇక మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చిందని పార్టీ నేతలకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మంగళవారం ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టిక్కెట్ విషయంలో అందరూ తన నిర్ణయాన్ని గౌరవించాలని, టిక్కెట్ రాని వారికి మరో పదవి ఇస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వనంత మాత్రాన తన మనిషి కాకుండా పోరని నేతలకు చెప్పారని సమాచారం.

 175 సీట్లకు 175 సీట్లు గెలవడం అసాధ్యమేమీ కాదని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు మనం చేసిన పని ఒక ఎత్తు, ఈ ఆరు నెలలు చేసే కార్యక్రమాలు ఒక ఎత్తు అన్నారు. క్షేత్రస్థాయిలో మనకు సానుకూలంగా ఉందని, వచ్చే ఆరు నెలలు కీలకమన్నారు. వచ్చే రెండు నెలల్లో జగనన్న సురక్ష, ఏపీ నీడ్ వైసీపీ అంటూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News