Kodali Nani: వాడెవడో స్టార్ వస్తే... లోకేశ్ వాడ్ని అన్నయ్యా అంటాడు: కొడాలి నాని

Kodali Nani take a swipe at TDP leaders

  • టీడీపీ అగ్రనేతలపై కొడాలి నాని విమర్శలు
  • చంద్రబాబు రాజకీయాల్లో ఉంటే గెలుపు వైసీపీదేనన్న మాజీ మంత్రి
  • జైల్లో దోమలు కుట్టక రంభా, ఊర్వశి, మేనక కన్ను కొడతారా అంటూ వ్యంగ్యం

ఏపీ మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టీడీపీ అధినాయకత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయితే పొరుగు రాష్ట్రం నేతలను బతిమాలి మాట్లాడిస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. జైల్లో దోమలు కుడుతున్నాయి అంటున్నారు... మరి దోమలు కుట్టక రంభా, ఊర్వశి, మేనకలు వచ్చి కన్ను కొడతారా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంతకాలం వైసీపీ గెలుపునకు ఢోకా లేదని అన్నారు. 

వాడెవడో స్టార్ వస్తే... లోకేశ్ వాడ్ని అన్నయ్యా అంటున్నాడని ఎత్తిపొడిచారు. ఓ పక్కన్న మామయ్య, మరో పక్కన అన్నయ్యను పెట్టుకుని లోకేశ్ ఏంచేయాలనుకుంటున్నాడని ప్రశ్నించారు. తండ్రి అరెస్ట్ అయితే, తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లవాడిలా లోకేశ్ బిత్తరచూపులు చూశాడని వ్యంగ్యం కొడాలి నాని వ్యాఖ్యానించారు. 

చాతనైతే జైల్లో పెట్టండన్న చంద్రబాబు ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల వెంట తిరుగుతున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు వయసును సాకుగా చూపించాలనుకుంటున్నారని, కానీ అన్ని ఆధారాలు ఉండబట్టే కోర్టు కస్టడీకి అప్పగించిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు సహా అన్నీ స్కాములేనని, ఏపీలో సింపతీ గేమ్స్ పనిచేయవని కొడాలి నాని స్పష్టం చేశారు.

Kodali Nani
TPD Leaders
Nara Lokesh
Pawan Kalyan
Chandrababu
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News