Chandrababu: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ ల విచారణ రేపటికి వాయిదా.. కారణం ఇదే!

Chandrabu bail petition hearing adjourned to tomorrow

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసును విచారించిన ఇన్ఛార్జ్ జడ్జి
  • ఒక్క రోజు వాదలను విని ఉత్తర్వులు ఇవ్వలేనన్న న్యాయమూర్తి
  • రేపటి నుంచి తాను సెలవుపై వెళ్తున్నానని వెల్లడి

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ తో పాటు ఆయన కస్టడీని పొడిగించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇప్పటి వరకు ఈ కేసును విచారించిన జడ్జి ఈరోజు సెలవులో ఉండటంతో... మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సత్యానందం ఈరోజు ఇన్ఛార్జి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. పిటిషన్లపై తమ వాదనలను వినాలని చంద్రబాబు, సీఐడీ తరపు లాయర్లు జడ్జి సత్యానందంను కోరారు. అయితే, ఈ ఒక్క రోజు వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం తనకు కష్టసాధ్యమని ఆయన చెప్పారు. రేపటి నుంచి తాను సెలవుపై వెళ్తున్నానని తెలిపారు. రేపు రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని సూచించారు. దీంతో బెయిల్, కస్టడీ పిటిషన్ లపై విచారణ రేపటికి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News