Ram: 'స్కంద'పై అంచనాలు పెంచిన రామ్ - బోయపాటి!

Skanda Movie Update

  • రామ్ హీరోగా రూపొందిన 'స్కంద'
  • ఈ నెల 28వ తేదీన సినిమా విడుదల 
  • కరీంనగర్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ 
  • ఇది మాస్ సినిమా మాత్రమే కాదని రామ్ వ్యాఖ్య
  • తనకి టెన్షన్ లేదని చెప్పిన బోయపాటి  

రామ్ - బోయపాటి కాంబినేషన్లో 'స్కంద' సినిమా రూపొందింది. శ్రీనివాస చుట్టూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సయీ మంజ్రేకర్ ఒక ప్రత్యేక పాత్రలో మెరవనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ' కరీంనగర్' వేదికగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

ఈ స్టేజ్ పై రామ్ మాట్లాడుతూ .. బోయపాటి సినిమాల్లో భారీ యాక్షన్ తో పాటు, అందుకు కారణమైన బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయని అన్నాడు. ఇది మాస్ సినిమానే అయినా .. కేవలం మాస్ అంశాలు మాత్రమే ఉండవని చెప్పాడు. ఈ సినిమా ద్వారా బోయపాటి ఇచ్చిన సోషల్ మెసేజ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని అన్నాడు.

ఇక బోయపాటి మాట్లాడుతూ .. తాను చాలా కూల్ గా కనపడుతున్నానని అంటున్నారనీ, నిజంగానే తనకి ఎలాంటి టెన్షన్ లేదని చెప్పాడు.  సినిమా తీసేటప్పుడు మాత్రమే తాను టెన్షన్ పడతాననీ, అవుట్ పుట్ వచ్చిన తరువాత అసలు టెన్షన్ ఉండదని అన్నాడు. అందుకు కారణం తాను బాగా సినిమా తీశాననే నమ్మకం తనకి ఉండటమేనని చెప్పాడు. 

Ram
Sreeleela
Saiee Manjrekar
Boyapati Sreenu
Skanda
  • Loading...

More Telugu News