Atchannaidu: నారా లోకేశ్ ఢిల్లీలో ఎందుకు ఉన్నారో చెప్పిన అచ్చెన్నాయుడు!

  • అరెస్టుకు భయపడి ఢిల్లీలో ఉన్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన అచ్చెన్న 
  • తండ్రికి ఇలా జరిగితే ఆయన ఢిల్లీలో తనవంతుగా న్యాయనిపుణులతో మాట్లాడుతున్నారని వెల్లడి
  • త్వరలో యువగళం ప్రారంభమవుతుందని వివరణ  

అరెస్టుకు భయపడే నారా లోకేశ్ ఢిల్లీలో ఉంటున్నారన్న మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు స్పందించారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో భాగంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు కలిశారు. ములాఖత్ అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ... అరెస్టుకు భయపడి లోకేశ్ ఢిల్లీలో ఉన్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. తాము తప్పులు చేయమని, ఎవరికీ భయపడేది లేదన్నారు. అవివేకులు మాత్రమే అలా మాట్లాడుతారన్నారు.

తండ్రికి ఇలా జరిగితే (చంద్రబాబు జైల్లో ఉండటాన్ని ఉద్దేశించి) ఆయన ఢిల్లీలో తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారని, ఢిల్లీకి వెళ్లి వాస్తవాలు చెప్పారని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఏపీలో జరుగుతున్న అంశాలను వివరిస్తున్నారని చెప్పారు. త్వరలో యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. అనుమతులు తీసుకున్నాక పాదయాత్రను ప్రారంభిస్తామన్నారు.

Atchannaidu
Chandrababu
Nara Lokesh
Telugudesam
  • Loading...

More Telugu News