Vijayasai Reddy: చంద్రబాబును కుట్టిన దోమలు అలా చనిపోతున్నాయట!: విజయసాయిరెడ్డి సెటైర్లు

Vijaya Sai Reddy satire on Chandrababu Naidu
  • చంద్రబాబుపై ప్రతి పీటీ వారెంట్‌కు వైసీపీయే కారణమంటున్నారని పరోక్ష విమర్శ
  • దోమలు ఫిర్యాదు చేసినా వైసీపీనే అంటారంటూ సెటైర్లు
  • ఫ్రస్టేటెడ్ తెలుగు తమ్ముళ్లు అంటూ చురకలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును దోమలు కుట్టి చనిపోతున్నాయట అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. చంద్రబాబుపై వేసే ప్రతి పీటీ వారెంట్‌కూ వైసీపీయే కారణమని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అందుకే జైల్లో దోమలు అంతర్జాతీయ న్యాయస్థానంలో పీటీ వారంట్ వేసినా, వారు తమకే అంటగడతారని ఎద్దేవా చేశారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. క్రిమికీటకాల నిజనిర్దారణ కమిటీ పరిశీలన అంటూ ట్వీట్ ప్రారంభించారు. చంద్రబాబును కుట్టిన వెంటనే దోమలు గుండె(వెన్ను)పోటుకు గురై చనిపోతున్నాయట... దీనిపై దోమల సంక్షేమ కమిటీ తీవ్రంగా స్పందించి చంద్రబాబుపై అంతర్జాతీయ క్రిమికీటకాల న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాయట.. ఇప్పుడు ఆ కేసులో కూడా పీటీ వారెంట్ వస్తే మన ఫ్రస్టేటెడ్ తెలుగు తమ్ముళ్లు దానికి కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ఉన్నారని సెటైర్లు వేశారు.
Vijayasai Reddy
Chandrababu
Telugudesam

More Telugu News