Chandrababu: ముగిసిన చంద్రబాబు సీఐడీ కస్టడీ

CID grills chandrababu naidu on second day

  • రెండ్రోజులపాటు 12గంటలకు పైగా చంద్రబాబు విచారణ
  • ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించిన సీఐడీ
  • కాసేపట్లో రిమాండ్‌పై న్యాయమూర్తి నిర్ణయం.. అందరిలోనూ ఉత్కంఠ

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఐడీ కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేతను... సీఐడీ కోర్టు ద్వారా రెండురోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది. నిన్న, ఈ రోజు చంద్రబాబును 12 గంటలకు పైగా, 120 ప్రశ్నలు అడిగింది. నిన్న దాదాపు ఏడు గంటల పాటు సీఐడీ 50 ప్రశ్నలను సంధించింది. ఈ రోజూ సాయంత్రం గం.5 వరకు విచారించింది. కొన్ని డాక్యుమెంట్స్ చూపించి ఈ నిధులు ఎటు వెళ్లాయని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సీఐడీ రెండు బృందాలుగా ఆయనను ప్రశ్నించింది.

కాగా, చంద్రబాబు రిమాండ్, కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ... న్యాయమూర్తిని కోరనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు రిమాండ్ కూడా నేటితో ముగియనున్నందున న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. చంద్రబాబును సీఐడీ అధికారులు వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు.

  • Loading...

More Telugu News