Roja: లోకేశ్... ఆంధ్రాకు ఎప్పుడొస్తున్నావ్?: మంత్రి రోజా వ్యంగ్యం

Roja satires on Nara Lokesh

  • చంద్రబాబు అరెస్ట్, లోకేశ్ ఢిల్లీ పర్యటనపై రోజా సెటైర్లు
  • లోకేశ్... నీ లొకేషన్ ఎక్కడ అంటూ రోజా వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం, లోకేశ్ ఢిల్లీ పర్యటనపై ఏపీ మంత్రి రోజా సెటైర్లు విసిరారు. దేశంలోనే అవినీతి అనకొండ అయిన చంద్రబాబుకు తొలి కస్టడీ డే శుభకాంక్షలు అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఖైదీ నెంబర్ 7691 కడుపున పుట్టిన నారా లోకేశ్ నీ లొకేషన్ ఎక్కడ? తండ్రి అడ్డంగా తినేసి జైలుకు వెళితే, మా నాన్న ఎలా పోయినా పర్లేదు నేను మాత్రం అరెస్ట్ కాకూడదని పారిపోయిన లోకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్? అని ప్రశ్నించారు. 

"తల్లి, భార్య మీద మీ నాన్న భారం వదిలేసి పలాయనం చిత్తగించిన పులకేశ్ నీ జాడ ఎక్కడ? మీ నాన్న అవినీతిపై బహిరంగ  చర్చకు రమ్మన్నావ్... నువ్వేమో రాష్ట్రం వదిలి పారిపోయావ్, మీ మామ బాలయ్య అసెంబ్లీ వదిలి పారిపోయాడు. చంద్రబాబు గజదొంగ అని అసెంబ్లీ సాక్షిగా నిరూపించడానికి మేం సిద్ధం... కాదని నిరూపించే ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే అసెంబ్లీకి మీలో ఎవరు వస్తారో రండి...  ఇది మా వైసీపీ సవాల్" అంటూ రోజా ఎక్స్ లో స్పందించారు.

Roja
Nara Lokesh
Chandrababu
Arrest
New Delhi
YSRCP
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News