Navdeep: నార్కోటిక్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన నవదీప్

Navdeep attends before police in drugs case

  • మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ పై ఆరోపణలు
  • ఇటీవల నోటీసులు పంపిన నార్కోటిక్స్ పోలీసులు
  • రామ్ చందర్ అనే వ్యక్తితో ఉన్న సంబంధాలపై ఆరా తీసిన పోలీసులు 
  • డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి లావాదేవీలు లేవన్న నవదీప్!

మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలసిందే. ఈ కేసులో నార్కోటిక్స్ పోలీసులు నోటీసులు పంపడంతో నవదీప్ ఇవాళ విచారణకు హాజరయ్యాడు. మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి నవదీప్ ను ప్రస్తుతం నార్కోటిక్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రామ్ చందర్ అనే వ్యక్తితో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రామ్ చందర్ తో ఆర్థిక లావాదేవీలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఆ లావాదేవీలు డ్రగ్స్ కు సంబంధించినవి కావని నవదీప్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తాను డ్రగ్స్ కొనుగోలు చేయలేదని పోలీసులకు తెలిపినట్టు సమాచారం.

More Telugu News